calender_icon.png 19 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఫొటోలన్నీ దాచుకున్నా

19-08-2025 02:08:12 AM

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ ఇందులో కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

- రీఎంట్రీలో కూడా హీరోయిన్‌గా వస్తున్నందుకు -చాలా హ్యాపీగా ఉంది. ఏ యాక్టర్‌కైనా మంచి పాత్ర చేయాలని ఉంటుంది. పాత్ర ఏదైనప్పటికీ బలంగా ఉండాలి. ఈ సినిమాలో చాలా అర్థవంతమైన పాత్ర నాది. చాలా కొత్త పాయింట్‌తో వస్తున్న ప్రాజెక్టు. చాలా ఫ్రెష్ కంటెంట్. 

- నేను హీరోయిన్‌గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నా. పెళ్లి ఇంట్లో ముందుగానే ప్లాన్ చేశారు. తర్వాత అమ్మాయి పుట్టింది. అలా సినిమాలకు ఒక బ్రేక్ వచ్చింది. ఇన్నేళ్ల విరామం తర్వాత తెరమీద చూసుకోవడం చాలా ఎక్సుటైంగ్‌గా ఉంది. - 

 -డైరెక్టర్ ఈ కథ చెప్పగానే షాక్ అయ్యాను. చాలా కొత్త స్క్రిప్ట్. కొంచెం సమయం కావాలని అడిగాను.. కానీ డైరెక్టర్ అంత టైమ్ ఇవ్వలేదు. ఆయన అంత నమ్మకంతో ఉన్నారు. -నా క్యారెక్టర్‌లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇందులో ఈ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది.. అది చాలా మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్.. చాలా ఫోటోలు తీసి దాచుకున్నా. 

- ఇండస్ట్రీలో -అప్పటికీ ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. మొత్తం మారింది. టెక్నికల్‌గా ఈజీ అయింది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వర్కింగ్ స్టుటైల్ మారింది. నాకంతా కొత్తగా అనిపించింది.  

 -నేను హీరోయిన్‌గా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశా. మా అమ్మ తెలుగులో ఎక్కువ పనిచేశారు. మా ఇంట్లో తెలుగే మాట్లాడుతూ ఉంటాం. నేను ‘ఈశ్వర్’ టైమ్‌లోనే తెలుగు నేర్చుకున్నా.

- ప్రభాస్‌తో -ఫ్రెండ్‌షిప్ ఈశ్వర్ సినిమా నుంచి అలానే ఉంది. ఆయనిప్పుడు బిగ్ స్టార్. అయినా ఇప్పటికీ చిన్నపిల్లాడిలానే నవ్వుతూ మాట్లాడతారు. అంతా అనుకున్న దానికంటే పెద్ద స్టార్ అయ్యారు.