calender_icon.png 1 November, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో కొత్త ప్రాజెక్టులోకి అదితి ఎంట్రీ

01-11-2025 12:09:24 AM

స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్. ‘విరుమాన్’ చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది.  ఇటీవల తెలుగులో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం అర్జున్‌దాస్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. దర్శకుడు అరివళగన్ తెరకెక్కిస్తున్న మరో మహిళా ప్రాధాన్య చిత్రంలోనూ అదితి లీడ్ రోల్ చేస్తోంది.  తాజాగా మరో కొత్త ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది.

మారి సెల్వరాజ్ బైసన్ కాలమాదన్ చిత్రానికి సంగీతం అందించిన నివాస్ కే ప్రసన్న ఈ చిత్రంలో నటిస్తు న్నారు. స్టోన్ బ్రూక్స్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు. తాజాగా అదితి తాను ఈ ప్రాజెక్టులో భాగమైన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ‘మన రాత రాసి జీవితాలను నిర్ణయించే విధి మన ఇద్దరికీ ఒకటేనా?’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఈ ఒక్క ఫోటోతో సోషల్‌మీడియాలో అదితి కొత్త సినిమాపై ఆసక్తికర చర్చ మొదలైంది. గతంలో జాడా (2019) చిత్రానికి దర్శకత్వం వహించిన కుమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.