calender_icon.png 1 November, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైన లేని వెన్నెలంత నేల మీదికొచ్చినట్టు..

01-11-2025 12:07:49 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూక’.  నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక కాగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూపర్ స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ ‘చిన్ని గుండెలో’ను రిలీజ్ చేశారు. ఒక సినిమాలోని ప్రతి పాటకు ప్రత్యేక కథ ఉంటుంది. 

ఇప్పుడు మూడో పాట కూడా అంతే మ్యాజికల్‌గా ఉంది. రాత్రి సముద్రతీరంలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ఇసుకపై నక్షత్రాలను చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తారు. సమయం వేగంగా సాగిపోతుందనే ఆందోళనతో హీరోయిన్ మాట్లాడగా, హీరో ‘మనమే ఈ క్షణాన్ని ఆపొచ్చు’ అని చెబుతాడు. అప్పుడే ఈ పాట మొదలవుతుంది. ఈ పాట ప్రేక్షకులను ఒక మ్యాజికల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

ఈ పాటలో నాయకానాయికలు నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ ఇద్దరూ మధురమైన క్షణాలను పంచుకుంటారు. ‘రంగురంగు తారలన్ని తొంగితొంగి ఒక్కసారి చూస్తున్నాయేంటిలా.. పైన లేని వెన్నెలంత నేలమీదికొచ్చినట్టు నువ్వుంటే చూడవా..’ అంటూ సాగుతోందీ పాట. వివేక్ స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా మర్విన్ సొలోమన్, సత్య యామిని ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.