calender_icon.png 1 November, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాంటిక్.. థ్రిల్లింగ్.. అగ్లీ స్టోరీ

01-11-2025 12:12:00 AM

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న కొత్తి చిత్రం ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ మహాదాస్యం, శివాజీరాజా, ప్రజ్ఞా నయన్ ముఖ్యపాత్రలో నటిస్తు న్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లో రానున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్ దారా; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్; ఆర్ట్: విఠల్ కోసనం; నిర్మాతలు: సుభాషిణి, కొండా లక్ష్మణ్; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ స్వరూప్.