calender_icon.png 12 September, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతన్న బెయిలుపై తీర్పు వాయిదా

22-09-2024 02:17:09 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితు డైన మేకల తిరుపతన్న హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు శనివారం పూర్తయ్యాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలని  తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీ సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ ఎస్‌ఐబీ ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫ్రంట్ టీంలో సభ్యుడిగా పిటిషనర్‌కు అప్పగించిన బాధ్యతలను నిర్వహిం చారని తెలిపారు.

కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో భాగమైన కాల్ డాటా రికార్డు ప్రకారం తిరుపతన్న ఎలాంటి నేరానికి పాల్పడలేదని వాదించారు. అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేస్తామని చెబుతున్నారని, అంటే ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని అన్నారు. ప్రణీత్‌రావు సూచనల మేరకు కాంగ్రెస్ లీడర్ల ఫోన్లను ట్రాక్ చేశారని చెప్పారు. కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడం తప్ప ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. ఇప్పటికే సమాచారం సేకరించినందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రితోపాటు పలువురు నేతలు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికా రుల ఫోన్లను ట్యాప్ చేసిన ఆరుగురు అధికారుల్లో మేకల తిరుపతన్న ఒకరని తెలిపారు. దీనిపై ఇప్పటికే అభియోగ పత్రం దాఖలు చేశామని, అదనపు అభియోగ పత్రం దాఖలు చేయనున్నామని చెప్పారు.  ఫోన్ ట్యాపింగ్‌లో తిరుపతన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని వెల్లడించారు.

గత ఏడాది డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం ప్రభాకర్‌రావు పిటిషనర్ తిరుపత న్నతో సహా ఆరుగురు అధికా రులతో సమావేశమై సమాచారాన్ని, ఆధారాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఇది కుట్రలో భాగంగా జరిగిందని అన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ ద్వారా పిటిషనర్‌కు చెందిన మొబై ల్ సమాచారాన్ని 348 జీబీ వెలికి తీశామని, ఇందులో కేవలం కాంగ్రెస్ నేతలకు చెందిన ఫోన్లను ఇంటర్‌సెప్ట్ చేశారని వివరించారు.

అంతేగాకుండా బీజేపీ  ఎమ్మెల్యే ఈటల రాజేందర్, అతని గన్‌మెన్ ఫోన్లను ట్యాప్ చేసి సేకరించిన సమాచారాన్ని హు జూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వినియోగిం చుకుందని తెలిపారు. కీలక సమాచారాన్ని తగులబెట్టారని, వివిధ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అందువల్ల ఈ దశలో బెయిల్ మం జూరు చేయరాదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.