calender_icon.png 12 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో రోడ్డు భద్రత చర్యలు భేష్

12-09-2025 01:31:46 AM

సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్‌ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమి టీ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు. గురువారం జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌తో కలిసి జూబ్లీహిల్స్, మాదాపూర్‌కు అనుసంధానించే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్‌ను, కొం డాపూర్‌ను గచ్చిబౌలితో అనుసంధానించే పి జనార్ధన్‌రెడ్డి ఫ్లైఓవర్‌పైన ప్రమాదాలు జరగకుండా తీసుకున్న భద్రత చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రయాణికులు రోడ్డు ప్ర మాదాల బారిన పడకుండా తీసుకున్న పటి ష్ట చర్యలను చైర్మన్‌కు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మాట్లాడుతూ.. “జీవితం విలువైనది. నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోకూడదు” అని పునరుద్ఘాటించారు. ఆ తర్వాత నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని జస్టిస్ సప్రే సందర్శించారు.

అక్కడ అధికారులు ఔటర్ రింగ్ రోడ్‌పై ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మరియు హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా నిర్వహించబడే ఓఆర్‌ఆర్ మీదుగా ప్రతిరోజూ 2.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. వారివెంట హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విఎస్‌ఎన్‌వి, జీహెచ్‌ఎంసీ ప్రాజెకట్స్ చీఫ్ ఇంజనీర్  భాస్కర్‌రెడ్డి, మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ ఉన్నారు.