12-09-2025 01:32:59 AM
మల్లారెడ్డి కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినో త్సవం సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించే అవగాహన సదస్సును గురువారం ప్రారంభించారు. కె.ఎం. పండు గవ ర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సూరారంలో నిర్వహించారు.
విద్యార్థులకు మానసిక ఆరో గ్య ప్రాధాన్యం, ఆత్మహత్యల నివారణలో కుటుంబం, స్నేహితులు మరియు ఉపాధ్యాయుల పాత్ర, అవసరమైనప్పుడు సహాయం కోరడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం నుంచి ప్రొ ఫెసర్ డా. సురేష్‌రెడ్డి కన్చర్ల,
అసోసియేట్ ప్రొఫెసర్ డా. గుందె సురేఖ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. సి. ప్రద్యుమ్న, క్లినికల్ సైకాలజిస్ట్ డా. సి. అనూషరెడ్డి, సీనియర్ రెసిడెంట్ డా. ఆర్. నిధి, జూనియర్ రెసిడెంట్స్ డా. అమూల్య, డా రుతుజా పాల్గొన్నారు. వైద్యు లు, నిపుణులు మాట్లాడుతూ.. యువతలో ఆత్మహత్యా ఆలోచనలు వస్తే వాటిని నిర్ల క్ష్యం చేయకుండా తక్షణం నమ్మకమైన వారి తో పంచుకోవాలి, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి అని సూచించారు.