calender_icon.png 22 July, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామ్రేడ్ వి.ఎస్ అచ్యుతానందన్ పోరాటాలు చిరస్మరణీయం

21-07-2025 07:32:15 PM

దొడ్డి కొమురయ్య భవన్లో సంతాప సభ..

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): వి ఎస్ అచ్యుతానందన్ స్ఫూర్తి నేటి యువతరానికి మార్క్సిస్టు పార్టీకి శిరోధార్యం అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వి.ఎస్ అచ్యుతానందన్(Former CM VS. Achuthanandan) కేరళ రాష్ట్రం తిరువనంతపురం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు హాస్పిటల్ లో అనారోగ్యంతో మరణించారు. వారి చిత్రపటానికి పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో వారు మాట్లాడుతూ, 1964 లో సిపిఎం ఏర్పాటు చేసిన సభ్యులలో వారు ఒకరిని అన్నారు.

నాటినుండి తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పేద మధ్యతరగతి కార్మిక రైతు ఉద్యమాలలో పనిచేస్తూ సమసమాజ నిర్మాణ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. 2006 నుండి 11 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసి వారి కాలంలో అనేక భూసంస్కరణలు తీసుకువచ్చి వేలాది ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగిందని ఉచిత విద్య వైద్యం అందరికీ అందే విధంగా ఎంతగానో కృషి చేశారని అన్నారు. కేరళలో ప్రతిపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేస్తూ అధికార ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కోసం అనేక సలహాలు సూచనలు చేశారని అన్నారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 

జైల్లో నిర్బంధించిన మొక్కవోని దీక్షతో స్వాతంత్ర ఉద్యమం కోసం పనిచేశారని గుర్తు చేశారు. 2007 ఉమ్మడి జిల్లా కోదాడలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ అడవి హక్కుల చట్టం సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిర్బంధాలు వచ్చిన తుది శ్వాస వరకు పేద ప్రజల పక్షాన పోరాడాలని కొనియాడారు ఆయన సేవలు చిరస్మరణీయమని అలాగే ఆయన ఆశయ సాధన కోసం యావత్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన  మరణానికి సిపిఐ ఎం నల్గొండ జిల్లా కమిటీ సంతాపం ఆ రాష్ట్ర కమిటీకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ సంతాప సభలో సిపిఎం నాయకులు నారీ ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండా శ్రీశైలం, ప్రభావతి, సయ్యద్ హశం, చినపాక లక్ష్మీనారాయణ, గంజి మురళీధర్, మహమ్మద్ సలీం, పీ నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, ఆవుట రవీందర్, కొండ వెంకన్న, కుంభం కృష్ణారెడ్డి, కోట్ల అశోక్ రెడ్డి, అద్దంకి నరసింహ, కందుల అశోక్, గుండాల నరేష్, బొల్లు రవీందర్ సర్దార్ అలీ పాలాది కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.