21-07-2025 07:48:50 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): ప్రజ్ఞ డిస్ట్రిక్ట్ 320-E అవార్డులో ప్రోగ్రాంలో లయన్ ఎంజెఎఫ్ వెంకటేశ్వర రావు పలు అవార్డులు అందుకున్నారు. ఈ లయన్స్టిక్ ఇయర్ కు కమిటెడ్ రీజియన్ చైర్ పర్సన్ గా వెంకటేశ్వర రావు అవార్డు అందుకున్నారు. ఎల్ సీఏఎఫ్ కి ఎంజెఎఫ్ డొనేట్ చేసినందుకు గాను గుడిపురి వెంకటేశ్వర రావు ఎంజెఎఫ్ మెమొంటోను అందుకున్నారు. డిస్టిక్ లీడ్ ఫోర్స్ కి సపోర్ట్ చేసినందుకు గాను ప్రత్యేకమైన అవార్డు అందుకున్నారు. తుంగతుర్తి క్లబ్ ని ఎక్స్టెండ్ చేసినందుకు గాను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిన్ ని, డిస్ట్రిక్ట్ గవర్నర్ బహుకరించారు. ఇలా మొత్తం డిస్టిక్ 320-E లో అత్యధిక అవార్డులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం చాలా చక్కటి కార్యక్రమాలు చేసి అవార్డులు అందుకున్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అవార్డులు అందుకున్న ప్రతి లయన్ మిత్రునికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం రీజియన్ చైర్పర్సన్ గా నాకు అవకాశం కల్పించిన గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి నేను విజయవంతం కావడానికి నాకు సహకరించిన లయన్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని తెలియజేశారు. దీనితో తుంగతుర్తి లైన్స్ సభ్యులు, మేధావులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.