21-07-2025 07:36:33 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar)లోని భగత్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షునిగా కొల్లూరు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సంఘ కార్యాలయంలో సంఘ సభ్యులచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అనంతరం జిల్లా నాయకులు నియామక పత్రం అందజేశారు. అనంతరం హరిప్రసాద్ మాట్లాడుతూ.. సంఘం అంటే అందరూ కలిసి ఉండి మానవసేవే మాధవసేవ అని సభాముఖంగా తెలియజేసారు. సంఘ అభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.