15-12-2025 01:22:28 AM
ములకలపల్లి, డిసెంబర్ 14,(విజయక్రాంతి):ములకలపల్లి మండలంలో ఆదివా రం నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 86.59% పోలింగ్ నమోదయింది. 20 పంచాయతీలకు గాను చాపరాలపల్లి గౌరవ రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో దానికి ఎన్నిక నిర్వహించలేదు. పొగ ళ్లపల్లి పంచాయతీ ఏకగ్రీవమైంది. మిగతా 18 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగగా మొత్తం ఓటర్లు 25,870 మంది ఉన్నారు.
22,401 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 11,012 మంది మహిళలు 11,389 మంది ఓటు వేశారు.3,469 మంది ఓటింగ్ కు గైరాజరయ్యారు. మండల వ్యాప్తంగా ఎన్నికలు ప్ర శాంత వాతావరణంలో జరిగాయి. జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీవో రా మారావు, ఎంపీఓ రమేష్ బాబు పోలింగ్ స రళిని, తీరుతెన్నులను స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా పాల్వంచ సీఐ సతీష్ పర్యవేక్షణలో ఎస్త్స్ర మధు ప్రసాద్ పోలీసు బం దోబస్తు నిర్వహించారు.