calender_icon.png 16 August, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్రికన్ల రేవ్ పార్టీ!

16-08-2025 12:00:00 AM

  1. బాకారంలో ఫామ్‌హౌస్‌లో మందు తాగుతూ చిందులు

భగ్నం చేసిన ఎస్‌వోటీ పోలీసులు

37 మంది మహిళలు, 14 మంది పురుషులు అరెస్టు

ముగ్గురికి గంజాయి పాజిటివ్

65 బీర్లు(టిన్స్), 20 లీడర్ల లిక్కర్ స్వాధీనం

కేసు నమోదు.. ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం 

వీసా గడువు ఉందా, ముగిసిందా? అనే కోణంలో దర్యాప్తు

చేవెళ్ల, ఆగస్టు 15: హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆఫ్రికన్లు రేవ్ నిర్వ హించడం కలకలం రేపింది. ఆఫ్రికన్‌కు చెం దిన ఓ యువతి బర్త్‌డే పేరిట మద్యం తాగు తూ, భారీ సౌండ్ సిస్టంతో కొనసాగుతున్న ఈ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఆఫ్రికాలోని ఉగాండాకు చెందిన మమమ్ అనే యువతి బర్త్‌డే ఉండటంతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఉగాండా, కెన్యా, లైబీరియా, క్యామెరూన్ తదితర 11 దేశాలకు చెందిన వ్యక్తులను ఆహ్వానించింది.

మొయినాబాద్ మండలం బాకారం పరిధిలోని ఎస్‌కే నేచర్ రీట్రీట్ పామ్‌హౌస్‌ను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసిం ది. గురువారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న వీళ్లు ఎలాంటి అనుమతి లేని మందు తాగుతూ, భారీ సౌండ్ సిస్టం పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్ పోలీసులు, శంషాబాద్ ఎస్వోటీ బృందంతో కలిసి ఫామ్‌హౌస్‌పై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మొత్తం 51 మంది విదేశీయులు పట్టుబడగా.. 37 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. ఇందులో 37 మంది ఉగాండా, ముగ్గురు లైబీరియాకు చెందిన వారు కాగా మిగితా వాళ్లు బోత్సువానా, కెన్యా, కామెరూన్, మొజాంబిక్, జింబాబ్వే, ఘనా, మలావీ, మరో రెండు దేశాలకు చెం దిన వాళ్లు ఉన్నారు. వీరి నుంచి 59 బడ్వైజర్ బీర్ టిన్లు-, 7 బుకార్డి బీర్లు-, 4 బ్రీజర్-, 3 ఐకానిక్ వైట్-, ఒక మాన్షన్ హౌస్, ఒక రాయల్ ఛాలెంజ్-, 5 సులా-, ఒక మెక్డొనెల్స్, 9 వోడ్కా బాటిళ్లు- స్వాధీనం చేసుకున్నారు.

ఈ పార్టీలో స్థానిక పోలీసుల నుంచి గ్యాదరింగ్, సౌండ్ సిస్టం, మద్యం కోసం ఎలాంటి అనుమతి తీసుకోలేదని విచారణలో తేలడంతో ఎక్సైజ్, పోలీస్ సౌండ్ పొల్యుషన్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇల్లీగల్ పార్టీకి అద్దెకు ఇచ్చినందుకు ఫామ్‌హౌస్ యజమానిపైనా కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.  

ముగ్గురికి గంజాయి పాజిటివ్

పట్టుబడ్డ వ్యక్తులతో పాటు ఫామ్‌హౌస్‌ను కంట్రోల్ తీసుకున్న పోలీసు అధికారు లు..  దాదాపు 80 మంది సిబ్బందిని కాపా లా ఉంచి విచారణ చేపట్టారు. అందరికీ డ్రగ్ కిట్‌తో టెస్టులు చేయగా ముగ్గురికి (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) పాజిటివ్ వచ్చింది.

ఇమ్మిగ్రేషన్ అధికారులు వచ్చి పట్టుబడ్డ 51 మంది వీసా గడువును పరిశీలించారు. సరైన డాక్యుమెంట్లు ఉన్న 15 మందిని విడుదల చేశారు. మిగిలిన వారికి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నుంచి రిస్ట్రిక్షన్ ఆర్డర్స్ జారీ చేసి, హోల్డింగ్ సెంటర్‌కు తరలించారు.