07-09-2025 12:20:35 AM
వినాయక శోభాయాత్రలో అపశృతి
మంగపేట, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మండలంలోని బ్రాహ్మణపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతం లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో డప్పు వాయించడానికి వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన గార అంజన్నతో పాటు సహాయకులు వచ్చారు.
నిమజ్జన వేడుకలను ముగించుకొని ఇంటికి వెళ్లే తరుణంలో మద్యం మత్తులో ఉన్న అంజ న్న రోడ్డు నిర్మాణం కోసం మట్టి తీసిన గుం తలో పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు లు శనివారం శవ పంచనామా చేసి నిర్ధారణ చేశారు.మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. తన తండ్రి ది సహజ మరణం కాదు అని జనార్ధన్ మం గపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.