calender_icon.png 6 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు ఏజెస్ ఫెడరల్ అండ

06-11-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): 2024 ఆగస్టు నెలలో ఐడీబీఐ బ్యాంకు, ఆర్‌ఎసి ఎల్బీనగర్ బ్రాంచ్‌లో హోమ్‌లోన్ తీసుకున్న రుణగ్రహీత బ్రెయిన్ డెడ్‌తో అకాల మరణం చెందారు. సదరు వ్యక్తి ఏజస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ సురక్షిత పాలసీ తీసుకోవటం వల్ల గృహ రుణం మొత్తాన్ని బ్యాంక్ చెల్లించి, నామినికి ఆస్తి పత్రాలు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ జనరల్ మేనేజర్ డా. సంతోష్ కుమార్, సునీతారెడ్డి, బ్రాంచ్ సెంటర్ హెడ్ జి అనిల్‌కుమార్ పాల్గొని బాధిత కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఐడిబిఐ బ్యాంకు హోమ్ లోన్ సెంటర్ హెడ్ మాట్లాడుతూ.. “ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇల్లు ఒక కల. ఆ కల నేరవేర్చుకునే క్రమంలో బీమా అనేది సహకారం అవుతుంది. ఆపద సమయంలో అండగా ఉంటుంది” అన్నారు. ప్రతి కస్టమర్ దీర్ఘకాలిక లోన్ తీసుకునేప్పుడు, ఇన్ఫూరెన్స్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బాధిత కు టుంబీకులు మాట్లాడుతూ.. “బ్యాంక్ లోన్ తీసుకునే సందర్భంలో బ్యాంక్ సిబ్బం ది మాకు ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించడంతో ఇన్సూరెన్స్ తీసుకున్నా ము. ఇటువంటి ఆపద సమయములో మా క్లైయిమ్ ఇప్పించిన సదరు బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు” తెలియజేశారు.