calender_icon.png 31 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ డిజిటల్ కేర్ ప్లాట్‌ఫాం

31-12-2025 12:57:15 AM

జాయింట్ మార్పిడి కోసం దేశంలోనే ల్యాండ్‌మార్క్ ఆస్పత్రిలో తొలిసారిగా ఏర్పాటు

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాం తి): ఏఐ ఆధారిత డిజిటల్ కేర్ ప్లాట్ఫామ్ జాయింట్ రీప్లేస్మెంట్ కోసం హైదరాబాద్‌లోని ల్యాండ్మా ర్క్ హాస్పిటల్స్ సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డా. కె. సుధీర్‌రెడ్డి నేతృత్వంలో మోకాలి, నడుము (హిప్), భుజం జాయింట్ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకునే రోగుల కోసం మై మొబిలిటీ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ కేర్ ప్లాట్‌ఫాంను భారతదే శంలో తొలిసారిగా ప్రారంభించింది. ఈ ఆధునిక ప్లాట్‌ఫాంను జిమ్మర్ బయోమెట్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసింది. ఇది ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో ఉపయోగంలో ఉంది.

ఇప్పుడు డా. కె.సుధీర్‌రెడ్డి, ఆయ న ఆర్థోపెడిక్ బృందం ద్వారా డిజిటల్, రోబోటిక్ జాయింట్ కేర్ సాంకేతికతను భారతదేశంలో ల్యాండ్‌మార్క్ హాస్పిటల్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆధునిక ప్లాట్ఫామ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ టెక్నాలజీతో సమన్వయంగా పనిచేసి, భద్రమైన శస్త్రచికిత్సలు, వేగంగా కోలుకోవ డం, మెరుగైన ఫలితాలను అందిస్తుంది.