31-12-2025 12:58:22 AM
రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
స్వామివారి దివ్యాశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ,డిసెంబర్ 30,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ హరిహరక్షేత్రం భక్తిశ్ర ద్ధలతో పులకించిపోయింది. అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు, ఉత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పార్వతి రాజ రాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను పెద్దసేవపై అర్చకులు మూడుసార్లు ఆలయ ప్రదక్షిణ చేయిం చారు.ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వా మివారిని దర్శించుకున్నారు. పల్లకి సేవలో పాల్గొని భక్తులతో కలిసి స్వామివారి సేవలో లీనమయ్యారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నందున స్వామివారికి ఏకాంతంగా పూజ లు నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అ న్ని ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తర ద్వార దర్శనం కల్పించడంతో భక్తులు క్రమబద్ధంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం శుభ ప్రదమై ఆనందాన్ని కలిగిస్తుందని భక్తులు తె లిపారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మా ట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరా రు. ముక్కోటి ఏకాదశి పర్వదినం శుభ సందర్భంగా, స్వామివారి కృపతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మరింత బలంగా ముందుకు సా గాలని ఆకాంక్షించి, ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.