calender_icon.png 12 October, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై ధాన్యం పోయొద్దు

11-10-2025 01:40:12 AM

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 10: రోడ్లపై ధా న్యం, మక్కలు పోయవద్దని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్‌రైతులకు సూచించారు. చిన్న కోడూరు మండలం మాచా పూర్ గ్రామ శివారులో రహదారిపై ధాన్యం, మక్కలు ఆరబోసిన విషయం తెలుసుకున్న సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, చిన్నకోడూర్ ఎస్‌ఐ సైఫ్ అలీ అక్కడికి వెళ్లి రైతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వచ్చిపోయే వాహనదారులకు ప్రమాదాలు అవకాశం ఉన్నద న్నారు. గతంలో అలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ధా న్యం పోసిన రైతుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు.