calender_icon.png 20 December, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి

20-12-2025 05:07:29 PM

మంథని,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మంథని మండల రైతులు,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో  శనివారం మంథని వ్యవసాయ మార్కేట్ కమిటీ కార్యాలయంలో పాలాభిషేకంలో అన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండా శంకర్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, సర్పంచ్ భూగొండ రవి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టేదాన్ని తుచ తప్పకుండా ఈ సంవత్సరం కూడా రైతులందరికీ క్వింటాల్ రూ.500 రూపాయలు వారి యొక్క ఖాతాలలో శుక్రవారం  నుండి జమ చేయడం జరుగుతుంది. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతులందరి మేలుకోరీ  అకాల వర్షాలతో రైతులకు దిగుబడి తక్కువ వస్తున్నందున, ఈ బోనస్ అనేది రైతులకు గొప్ప వరం లాంటిదని నాయకులు కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వరిధాన్యానికి క్వింటాల్ కి రూ. 500 బోనస్ వేయడంతో రైతుల కళ్ళల్లో  ఆనందం కలిగించే విషయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచినటువంటి మంథని మండలంలోనే 35 సర్పంచులకు గాను 30 సర్పంచులను  అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించారని అన్నారు.