calender_icon.png 27 September, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐలమ్మ స్ఫూర్తినీయురాలు

27-09-2025 01:49:21 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 26 : చాకలి ఐలమ్మ వీరవనిత అని, మహిళలకు ఐలమ్మ స్ఫూర్తినీయురాలని కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్ లో శుక్రవారం చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పగడాల ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విగ్రహావిష్కరణలో టీ పీసీసీ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాటంలో వీరవనిత ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి మరవలేమన్నారు.

చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు పున్న గణేశ్ నేత, చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, బొడ్డుపల్లి మహేందర్, జ్ఞానేశ్వర్ యాదవ్, పగడాల శ్రీశైలం, రామకృష్ణ గౌడ్, బొడ్డుపల్లి నగేష్, అంజి, డల్లి, నర్సింహ చారి, కిట్టు, అనిల్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

యువత ఆదర్శంగా తీసుకోవాలి 

తాండూరు, 26 సెప్టెంబర్, (విజయ క్రాంతి) : వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట పటిపను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మున్సిపల్  కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గం లో నడుచుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మణిపాల్ ,నరేందర్ రెడ్డి ,ఉమేష్ కుమార్, వెంకటయ్య మరియు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26: వీరవనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా రెవిన్యూ అధికారి సంగీత అన్నారు. శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యా లయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. కలెక్టరేట్ ఏ.ఓ.సునీల్, బీసీ వెల్ఫేర్ అధికారి కేషురామ్, సిబ్బంది పాల్గొన్నారు.