calender_icon.png 9 January, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు గుర్రాలపై గురి

08-01-2026 12:00:00 AM

  1. వార్డుల వారిగా అభ్యర్థుల ఎంపిక 

మున్సిపాల్ ఎన్నికల పై పార్టీల కసరత్తు

మొదలైన సన్నాహక సమావేశాలు

రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఇన్చార్జిలు 

రంగారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలపై అధికార పార్టీ ప్రత్యేక గురి పెట్టింది. పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది.మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాల ’ పైచేయి’ సాధించేలా క్షేత్రస్థాయి కసరత్తులు ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మున్సిపాలిటీ వారిగా సర్వే చేయించి పార్టీ బలాలు, బలహీనతలు పై దృష్టి సారించింది.సీఎం రేవంత్ రెడ్డి  రెండు రోజుల క్రితం పీసీసీ చీఫ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి...

జిల్లా ఇన్చార్జి మంత్రులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు పార్టీ ఇంచార్డిల కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లో ఉన్న మున్సిపాలిటీలో అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ఎత్తుగడలు వేయాలని ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వొద్దు అంటూ అంతర్గతంగా  నేతలకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల పై  ప్రధాన రాజకీయ పార్టీలు సైతం కసరత్తు ముమ్మరం చేశాయి.

మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అసంబ్లీ, పార్లమెంట్  ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ స్థానిక పోరు ౠలో బీఆర్‌ఎస్, బీజేపీ లు అనూహ్యంగా పుంజుకోవడం తో ఆ పార్టీ  శ్రేణుల్లో  కొంత ఆత్మస్థైర్యం నింపినట్ల య్యింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు బిఆర్‌ఎస్, బిజెపి పార్టీ లు సైతం ఎన్నికల కు సై అంటుంది. దీంతో ఆయా పార్టీ లు గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో  15 మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఉండగా అందులో ఎనిమిది మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లను ఇటీవల ప్రభుత్వం జిహెచ్‌ఎంసిలో విలీనం చేసింది. ప్రస్తుతం 

 ఏడు మున్సిపాలిటీలు..

ఆమనగల్, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి  మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా  కొత్తూరు మున్సిపాలిటీ  కి పాలకవర్గం గడువు తీరకపోవడం తో అక్కడ ఎన్నికలు మరింత సమయం పడుతుంది. మిగతా ఆరు మున్సిపల్ ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పట్టు నిలుపుకొనేలా బీఆర్‌ఎస్..

గత మున్సిపల్ ఎన్నికల్లో  బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాల ను గెలుచుకొంది. రాష్టంలో అధికారం కోల్పోయి  మారిన రాజకీయ పరిణామాల  నేపథ్యంలో  మళ్ళీ పురఎన్నికలో పట్టు నిలుపుకునేలా  ఎత్తుగడలు వేస్తుంది. నియోజకవర్గాలో   సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపుతుంది. మున్సిపాలిటీ,వార్డుల వారిగా బస్తి బాట పేరుతో ప్రచారానికి సైతం దిగింది. వార్డుల వారిగా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను గెలుపు గుర్రాలను అధికారపాటికి దీటుగా నిలబెట్టేలా వ్యూహలు సిద్ధం చేసే పనులు పార్టీ నేతలు నిమగ్నంగా అయ్యారు.

మున్సిపాలిటీలో పుంజుకొవాలని బీజేపీ..

పురపాలికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ మేరకు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా లో ఆరు మున్సిపల్ పరిధిలో  ఆయా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపు గుర్రాలపై కీలక నేతలతో చర్చిం చారు. గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని.. పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ కు దీటుగా అభ్యర్థులను రంగంలోకి దించేలా క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలను జల్లెడ పట్టే బాధ్యతలను పలువురికి అప్పగించినట్లు సమాచారం.

అభ్యర్థుల ఎంపిక పై దృష్టి..

స్థానిక పోరు లో విజయం సాధించినా కానీ కాంగ్రెస్ లో కొంత అసంతృప్తి నెలకొంది. మెజార్టీ స్థానాలు సాధించలేకపోయామని నేతలు బహిరంగంగానే తమ లోపాలను బయట పెట్టుకున్నారు. సమన్వయంతో పార్టీలో ముందుకు వెళ్ళలేదని పంచాయతీలో వచ్చిన ఫలితాలను చూసి తమ తప్పులను ఒప్పుకుంటున్నారు. పంచాయతీ లో బీఆర్‌ఎస్ పుంజు కోవడం తో కాంగ్రెస్ నేతలను కొంత  ఇరకాటంలో పడేసినట్లయ్యింది.

స్థానిక పోరు లో బీఆర్‌ఎస్, బీజేపీ  మద్దతుదారులు గెలవడా నికి ప్రధాన కారణం స్వపక్షంలోని రెబల్స్ అభ్యర్థులేనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. సీఎం సైతం జిల్లా, నియోజకవర్గా ల వారిగా ఫలితాలను చూసి కొంత అసంతృప్తి వెళ్ళగక్కారు. నియోజకవర్గం ఫలితాలను చూసి  అందుకు బాధ్యులపై  చీవాట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో పురపాలక పోరులో రెబల్స్ ప్రభావం లేకుండా ఆ పార్టీ ముఖ్య నేతలు  ఆచితూచి వ్యవహరిస్తు న్నారు. 

ఇందులో భాగంగా ఆయా డివిజన్లు / వార్డుల వారీగా ఆశా వహలు,కౌన్సిలర్ అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరి స్తోంది. ప్రస్తుతం వ్యక్తిగత సమాచారం తో పాటు ఆయా వార్డుల్లో బలా బలాలు, సామాజిక వర్గాల వారిగా ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు  ఖరారు చేసే పనులు ప్రస్తుతం నేతలు నిమగ్నం అయ్యారు.