calender_icon.png 9 January, 2026 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారాలు సరికాదు

08-01-2026 12:00:00 AM

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ 

సోషల్ మీడియా కో- కన్వీనర్- సునార్కని సాంబశివ

కన్నాయిగూడెం, జనవరి 7 (విజయక్రాంతి): ఆదివాసీ గిరిజన మహాజాతర శ్రీమేడారం సమ్మక్క సారలమ్మాల జాతర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష హోదాలో ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క ఎన్నోమార్లు మేడారం జాతరకు ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చెయ్యండి అని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అడిగిన కనీసం మేడారం జాతర సమయానికి కూడా నిధులు విడుదల చెయ్యకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో ఉన్న ఒక్క మంత్రి ఎమ్మెల్యే లోకల్ లీడర్లు కూడా మేడారం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లెవ్వుని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కన్వీనర్- సునార్కని సాంబశివ అన్నారు. ఇకనైనా బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయవద్దని రాజకీయ లబ్ధికోసం దిగజారి మంత్రిపైన లేనిపోని అబండాలు వెయ్యడం మానేయ్యండని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్-సునార్కని సాంబశివ హెచ్చరించారు.