calender_icon.png 9 January, 2026 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టులు తలుచుకుంటే మతోన్మాద పార్టీల పతనం తప్పదు

08-01-2026 12:00:00 AM

మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి 

మహబూబాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): మతోన్మాద సామ్రాజ్యవాద పార్టీల పెత్తనాన్ని నిలువరించడం కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యమని, దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్‌లో బుధవారం దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత, నేటి ఆవశ్యకత అంశంపై సిపిఐ జిల్లా కార్యదర్శి బీ.విజయసారథి అధ్యక్షతన జరిగిన సెమినార్లో ముఖ్యఅతిథిగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది సభలో లక్షలాది మంది కదలి వచ్చి ఫాసిస్టు బిజెపికి బుద్ధి చెప్పే విధంగా జనం కదలాలని పిలుపునిచ్చారు.

ఈ సెమినార్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి ,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.అజయ్ సారధి రెడ్డి , నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, ప్రజాపక్షం జిల్లా స్టాపర్ కల్లూరి ప్రభాకర్, టీఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు ఉదయధీర్, 143 జిల్లా కన్వీనర్ గట్టయ్య పాల్గొన్నారు.