06-08-2024 12:00:00 AM
ఇటీవల మద్రాసు హైకోర్టు తమిళనాడు రాష్ట్ర పరిధిలో నడుపుతున్న విమాన సర్వీసులలో విమానయాన సంస్థలు తమ ప్రకటనలు, సూచనలు తమిళంలో తప్పనిసరిగా చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు ఉత్తర్వులు జారీ చేయటం ముదావహం. అంతర్రాష్ట్ర సర్వీసులకు హిందీ, ఇంగ్లీషు భాషలను వాడు తున్నా, ఆయా రాష్ట్ర పరిధులలో నడిపే విమాన సర్వీసులలో ఆయా రాష్ట్రాల అధికార భాషలను వాడటం మంచి ఉద్దేశ్యం.
దీనివల్ల ఆయా రాష్ట్రాల అధికార భాషలను గౌరవించినట్లు అవు తుంది. తద్వారా విమానయాన సంస్థలపట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. కేంద్ర విమానయాన శాఖ మన తెలుగు రాష్ట్రాల పరిధులలో నడిపే విమాన సర్వీసులలోనూ తెలుగులో ప్రకటనలు, సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్