calender_icon.png 31 August, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కోవెల సంపత్కుమారాచార్య వర్ధంతి

05-08-2024 12:00:00 AM

డా.కోవెల సంపత్కుమారాచార్య 1933 జూన్ 26న వరంగల్లులో జన్మించారు. చూడమ్మ, కోయిల్ కందాడై రంగాచార్యులు వీరి తల్లిదండ్రులు. 2010 ఆగస్టు 5న కన్ను మూసిన సంపత్కుమారాచార్య చేతనావర్త కవులలో ఒకరు. కృష్ణాజిల్లాలోని చిట్టి గూడూరు ప్రాచ్య కళాశాలలో భాషాప్రవీణ (1949- చదివారు. తెలుగులో ఎంఏ (ఉస్మానియా నుండి, 1963), హిందీలో ఎంఏ (1966) ఉత్తీర్ణులైనారు.

తొలి రోజులలో (తన అన్న కుమారుడైన) కోవెల సుప్రసన్నాచార్యతో కలిసి ‘హృద్గీత’ శీర్షికన శతకం రచించారు. జంటకవులుగా ‘ఆనందలహరి’ కావ్యం రచించారు. ‘శబరీ’ అనే కావ్యాన్ని రచించి విశ్వనాథ వారికి అంకితం చేశారు. ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ- సంప్రదాయరీతి’ (1978) అనే సిద్ధాంత గ్రంథం రాసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు.