13-08-2025 12:00:00 AM
మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొయ్యడ సృజన్ కుమార్
కరీంనగర్ క్రైం, ఆగస్టు 12 (విజయ క్రాంతి): విద్యారంగ సమస్యలపై దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాల సారధి గా విద్యార్థులకు అండగా నిలిచిన ఏకైక విద్యార్ధి సంఘం ఎఐఎస్‌ఎఫ్ మాత్రమేనని మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొయ్యడ సృజన్ కుమార్ కొనియాడారు. మంగళవారం ఎఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గీతభవన్ చౌరస్తాలో ఎఐఎస్‌ఎఫ్ జెండాను సృజన్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే మొట్ట మొదటగా ఏర్పడిన ఏకైక విద్యార్ధి సంఘం ఎఐఎస్‌ఎఫ్ మాత్రమేనని అన్నారు. రానున్న రోజుల్లో విద్యా రంగ సమస్యల పరిష్కా రం కోసం, ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ప్రగతిశీల మిలిటెంట్ పోరాటాలకు విద్యార్థిలోకం సిద్ధం కావాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, మచ్చ రమేష్, హేమంత్, మాజీ నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపెల్లి రాజు, బోనగిరి మహేందర్, తాళ్ళపల్లి లక్ష్మణ్, యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్,నగర నాయకులు కసిరెడ్డి సందీప్, జ్ఞానేశ్వర్, బోయిని విష్ణు, వెంకటేష్, శ్రావణి, రమ్య, సహస్ర, మనస్విని, మాధవి, స్వప్న, స్వాతి, తదితరులు పాల్గొన్నారు