calender_icon.png 13 August, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైంసా సబ్ కలెక్టర్ కు సన్మానం

13-08-2025 06:58:53 PM

భైంసా: నిర్మల్ జిల్లా(Nirmal District) బైంసా సబ్ కలెక్టర్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన బంజారా ముద్దుబిడ్డ అజ్మీర సాంకేత్ కుమార్ ను నిర్మల్ జిల్లా బంజారా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సన్మానం చేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో సన్మానం చేసి మెమొంటో అందించారు. నిర్మల్ జిల్లాలో బంజారాల స్థితిగతులు జనాభా వారి జీవన వైవిధ్యం తదితర అంశాలపై సబ్ కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తుకారం రాజేష్ బాబు, నాజీమ్ సింగ్, పాండు నాయక్, సాయబురావు, రాజేందర్ తదితరులు ఉన్నారు.