24-01-2026 01:21:54 AM
విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ సి 1610 వద్ద ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ ప్లాగ్ షిప్ స్టోర్‌ను నటి ఐశ్వర్య రాజేష్ శుక్రవారం ప్రారంభించారు. స్టోర్ వెలుపల ఆభరణాల కలెక్షన్స్‌ను తిలకించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నటి కవిత, హాస్య నటుడు బాబు మోహన్, వర్ధమాన నటి పూనమ్ సాహిల్, గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పహిల్వాన్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాలు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారన్నారు. ఇక వెడ్డింగ్ కలెక్షన్ కు విశిష్ట కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్నారు. విశిష్ట సీఈఓ, డైరెక్టర్ సిందుజా, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఆభరణాన్ని అత్యున్నత నైపుణ్యం కలిగిన కారిగులు శ్రద్ధతో డిజైన్ చేసినట్లు వివరించారు. ప్రతి డిజైన్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందన్నారు.
ప్రారంభం సందర్భంగా వినియోగదారులకు ఆఫర్లు, బహుమతులను అందజేస్తున్నట్లు వివరించారు. గోల్డ్, పోల్కీ జ్యూవేలరీ పై నో వేస్టేజ్ మెకింగ్, లక్ష రూపాయల కొనగోలు పై సిల్వర్, గోల్ కాయిన్స్ తో పాటు లక్కీ డ్రా ద్వారా లక్షల విలువైన బహుమతులను అందిస్తున్నట్లు వివరించారు.