calender_icon.png 24 January, 2026 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ది..‘ఏకతా మానవతా సిద్ధాంతం’

24-01-2026 01:21:45 AM

మోదీ నాయకత్వంలో 12ఏళ్లుగా ఆచరిస్తున్నాం

గతంలో నిర్లక్ష్యానికి గురైన మేధావుల ఆలోచనలు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): భారతదేశానికి ‘ఏకతా మానవతా సిద్ధాంతం’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతం రూపొందించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. --గతంలో  మేధావుల ఆలోచనలను నిర్లక్ష్యం చేసి ఆచరణ సాధ్యం కాని పాశ్చాత్య సిద్ధాంతాలను భారత దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విమర్శించారు. 12 ఏళ్లుగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సూత్రీకరించిన సి ద్ధాంతం ఆధారంగా నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నారన్నారని చెప్పారు.

క్యాపిటలిజం, కమ్యూనిజంలకు ప్రత్యామ్నాయంగా భారతీయ మూలాలను,  జీవన విధానాన్ని ఆలోచనలను సాంప్రదాయాలకు అనుగుణంగా జన్ సంఘ్ మహాసభల్లో దీన్ దయాళ్ ఏకాత్మ మానవతా సిద్ధాంతాన్ని రూపొందించారని పేర్కొన్నారు.  నరేంద్ర మోదీ నాయకత్వంలో అంత్యోదయ కార్యక్రమాన్ని ఆచరణలో చూపిస్తున్నామన్నారు.  స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ దేశంలో 12 కోట్ల మంది ఇండ్లలో టాయిలెట్లను నిర్మించామని, 4 కోట్ల మందికి గృహ నిర్మాణం చేయడంతో పాటు కుళాయిల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలోని వెనుకబడిన జిల్లాలను అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థను పేద చేతిలో డిజిటలైజ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యంగ్యంగా మాట్లాడిన తీరును ఆయన గుర్తు చేశారు. నేడు డిజిటల్ పేమెంట్, డిజిటలైజ్‌లో దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.  మన ఆర్థిక వ్యవస్థ చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనేదే పండిట్ ఆలోచన అన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ జీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్, సోము వీర్రాజు, భూపతి రాజు, పురందేశ్వరీ, సత్యకుమార్, సుజనాచౌదరి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, పార్ధసారథి, శివప్రసాద్ పాల్గొన్నారు.