24-12-2025 01:15:33 AM
ఇల్లందు టౌన్, డిసెంబర్ 23 (విజయక్రాం తి):ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ ఆద్వర్యంలో మంగళవారం ఉదయం షిఫ్ట్ లొ కెఓసి, జెకెఓసి, సివి ల్ డిపార్ట్మెంట్,ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్స్, ఏరియా హస్పిటల్, ఎస్&పీసీ డిపార్ట్మెంట్లు వద్ద కార్మికులు నల్ల బ్యా డ్జీలు ధరించి సింగరేణి డే బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఏరియా వర్క్ షాప్ కా ర్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సింగరేణి ఆవిర్భా వ దినోత్సవాన్ని ఈసారి నామమాత్రంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు సంస్థ వ్యాప్తం గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
గుర్తింపు సంఘంతో ఎలాంటి చర్చ లేకుండానే సర్కులర్ విడుదల చేయడంలో యాజమాన్యం చూపిన అ త్యుత్సాహంపై గుర్తింపు సంఘం తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.గత 25 సం వత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి రాజకీ య జోక్యంతో నామమాత్రంగా జరపాలని నిర్ణయించడం అత్యంత విడ్డూరమన్నారు. హైదరాబాద్లో ఒక గంట పాటు తెలంగాణ ముఖ్యమంత్రి అతని మనవడు పాల్గొన్న ఫు ట్బాల్ ఆట కోసం సింగరేణి యాజమాన్యం పది కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సింగ రేణి తల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించ లేకపోవడం ఏమిటని గుర్తింపు సంఘం సూటిగా ప్రశ్నిస్తోందని అన్నారు.
ఐ ఏఎస్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అడగకుండానే లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్ర భుత్వం సింగరేణి నిధులను దానం చేస్తున్నా యాజమాన్యానికి ఎలాంటి సోయి లేకపోవ డం దురదృష్టకరం అని దుయ్యబట్టారు.
అ రగంట ఆట కోసం పది కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం సంవత్సరానికి ఒక్కసారి వ చ్చే సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని నామమాత్రంగా నిర్వహించడాన్ని వ్యతిరేకంగా ఏ ఐటీయూసీ ఆధ్వర్యంలొ కార్మికులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆఫీస్ బేరర్స్ కొంగర వేంకటేశ్వర్లు, బానొత్ బాలాజీ, ఫిట్ కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, దాట్ల వేంకటేశ్వర్లు,వి జయరాజ్, కలవల సిద్దార్ద్, ఎస్కే చాంద్ పాష,మఖ్బుల్ పాల్గొన్నారు.