calender_icon.png 24 December, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాస్తుల రవాణా అధికారి

24-12-2025 01:38:47 AM

  1. ఆదాయానికి మించి మహబూబ్‌నగర్ డీటీసీ ఆస్తులు 
  2. ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ తనిఖీలు 
  3. 4౦ ఎకరాల  భూమి పత్రాల గుర్తింపు
  4. ఇవికాక.. పెట్రోల్ బంకులు, కళ్లుచెదిరే షాపింగ్ మాళ్లు, హోటళ్లు
  5. అక్రమాస్తుల విలువ రూ.2౦౦ కోట్లకు పైగానే.. 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కళ్లుచెదిరే షాపింగ్ మాళ్లు, మిరుమిట్లు గొలిపే హోటళ్లు.. బ్యాంక్ లాకర్లలో కిలోన్నర బంగారు ఆభరణాలు.. సొంతంగా పెట్రోల్ బంకులు.. ౩౦ ఎకరాల వ్యవసాయ భూమి.. 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తంగా అక్రమాస్తుల విలువ సుమారు రూ.2౦౦కోట్లకు పై గానే. ఒక డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కమిషనర్ ఇంత మొత్తంలో ఆస్తులు కూడబెడ తాడా? అని ఏసీబీ అధికారుల కళ్లబైర్లు కమ్మాయంటే సదరు అధికారి చేయివాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ అవినీతి తిమింగలం బాగోతం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదాయానికి మించి మహబూబ్‌నగర్‌లోని డీటీసీ కిషన్‌నాయక్ అక్రమాస్తులు కూడబెట్టారని వస్తున్న ఫిర్యాదుల మేరకు మంగళ వారం ఏసీబీ సిబ్బంది డీటీసీ నివాసంతో పాటు ఏకకాలంలో ౧౨ చోట్ల దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, బం గారం, నగదు బయటపడటం రవాణా శాఖ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

నిందితుడి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ముప్పేట దాడి చేశారు. హైదరా బాద్ నగరంలో ఏకంగా ఆరు చోట్ల సోదా లు నిర్వహించగా, నిజామాబాద్ జిల్లాలో మూడు చోట్ల, సంగారెడ్డి, -కామారెడ్డి సరిహద్దు ప్రాంతమైన నారాయణఖేడ్‌లో మరో మూడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ సోదాల్లో కిషన్‌నాయక్ అక్రమ సామ్రాజ్యానికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి.

బయటపడి ఆస్తుల చిట్టా

డీటీసీ కిషన్ నాయక్ కేవలం ఇళ్లు, స్థలాలే కాకుండా ఏకంగా హోటళ్లు, భారీ ఎత్తున వ్యవసాయ భూములను పోగేసినట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. నారాయ ణఖేడ్ ప్రాంతంలో 30 ఎకరాల వ్యవసాయ భూమి కిషన్ నాయక్ కుటుంబం పేరిట ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో 10 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. మొత్తం 40 ఎకరాల భూమిని ఆయన కలిగి ఉండటం విశేషం. నిజామాబాద్ నగరంలో లహరి ఇంటర్నేషనల్ పేరుతో ఉన్న ఓ భారీ హోటల్ కిషన్ నాయక్‌దేనని అధికారులు గుర్తించారు.

దీనికి సంబంధించిన యాజమాన్య పత్రాలను సీజ్ చేశారు. హైదరా బాద్, నిజామాబాద్‌లలో పలు లగ్జరీ అపార్టుమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా దొరికాయి. ఆస్తులను కేవలం స్థిరాస్తులుగానే కాకుండా బంగారం రూపంలోనూ దాచినట్లు బయటపడింది. సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్‌లో ఉన్న అజిత్ గోల్ దుకాణంలో కిషన్ నాయక్ తన పేరుతో దాదాపు కిలో బంగారాన్ని ఉంచినట్లు గుర్తించారు. అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బినామీలపైనా నిఘా..

కిషన్ నాయక్ అక్రమాస్తుల్లో చాలా వరకు బినామీల పేర్ల మీద ఉ న్నాయన్న అనుమానంతో అధికారులు ఆ దిశగానూ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని కిషన్ నాయక్ బం ధువు విజయ్ నివాసంలోనూ సోదా లు జరిపారు. అక్కడ ఆస్తులకు సంబంధించిన పలు కీలక దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. బహిరంగ మార్కెట్‌లో గుర్తించిన మొత్తం అక్రమాస్తుల విలువ రూ.౨00 కోట్ల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.