calender_icon.png 24 December, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ వల్లే పాలమూరుకు అన్యాయం!

24-12-2025 01:22:37 AM

  1. అపెక్స్ కౌన్సిల్‌లో 299 టీఎంసీలకే అగ్రిమెంట్
  2. అందులో పాలమూరు- రంగారెడ్డి ప్రస్తావనే లేదు
  3. కృష్ణా నీటి పంపకాలపై ఒప్పందమే శాపమైంది
  4. కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరె రాం

హైదరాబాద్ , డిసెంబర్ 23 సిటీబ్యూరో (విజయ క్రాంతి ) : కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్లే కృష్ణా జలాల్లో పాల మూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరె రాం చెప్పారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కృష్ణాజలా లపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 811 టీఎంసీల వాటా ఉండగా కేసీఆర్ 299 టీఎంసీలకే అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు.

ఆ ఒప్పందం వెనుక ప్రయోజనమేమిటో ఆయనకే తెలియాలన్నారు. ఆ ఒప్పందమే కృష్ణా జల వాటాల్లో శాపమైందని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని 299 టీఎంసీల నీటికి కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకు న్నారా? అనేది ఆయనే చెప్పాలన్నారు. 299 టీఎంసీల నీటిని తెచ్చుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్పితే ఒక్క ఎకరాలకు నీళ్లు రాలేదన్నారు.

1050టీఎంసీల నీటిని రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ట్రిబ్యునల్ వేసిందని తెలిపారు.  ఆ ట్రిబ్యునల్‌లో ప్రణాళికాబద్ధంగా అడ్వకేట్లను పెట్టుకుని వాదించి ఉంటే 650 టీఎంసీలకు పైగా నీటి వాటా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గత కాంగ్రెస్ హయా ంలో నాలుగు టీఎంసీల నీరు తరలించుకుపోతే బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 10 టీఎంసీల నీటి అక్రమంగా తరలించుకుపోయారని గుర్తు చేశారు.

దీనిని బట్టి చూస్తే తెలంగాణకు అన్యాయం చేసిందెవరని ప్రశ్ని ంచారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వడానికి  కేసీఆర్ 14నెలలు ఎం దుకు ఆలస్యం చేశారని శ్రీరాం ప్రశ్నించారు. 299 టీఎంసీల అగ్రిమెంట్‌లో పాలమూ రు- రంగారెడ్డి నీటి కేటాయింపులే లేవని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు సార్లు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క ఒకసారి డీపీఆర్ ను కేంద్ర జలశక్తి శాఖ తిప్పి పంపిందని తెలిపారు. వివరాలు సరి గా లేని కారణంగా రిటర్న్ చేసిందని చెప్పారు. అలా పంపడం తిరస్కరించడం కాదని మరింత సమగ్రంగా ఇవ్వాలని కోరడమని చెప్పారు.