24-12-2025 01:47:38 AM
సూర్యాపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి): నదీ జలాలపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన శూన్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించి మాట్లాడారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించడానికి కేసులు, నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిం చారు.
ఆరు గ్యారంటీలు నూరు రోజు లు ఎటుపాయే అని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. అ డ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నదని విమర్శించారు. పాలమూ రు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
తమ ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేక రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారన్నారు. డీపీఆర్ పంపడంలో విఫలమవడమే కా కుండా, ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నా రని విమర్శించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలా ల్లో న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరా టం ఆగదని కేటీఆర్ స్పష్ట చేశారు.
ఓటమి భయంతోనే ఎన్నికలకు వెనకడుగు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎ న్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భ యంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి ఎన్నికలకు వెళ్లకుండా, నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయదారులు, కూలీలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని, ఆ ప్రభావం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
రైతుబంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల భరోసా వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ పై నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, రైతులకు మంచి చేశామన్న నమ్మకం ఉంటే.. సహకార ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ’420’ హామీలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపలేక ఎన్నికల నిర్వహణ నుండి తప్పించుకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను కూడా ప్రభుత్వం భయంతోనే వాయిదా వేస్తోందని, అవి జరిపితే రైతులు ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీలలో 40 శాతం బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారని, స్వల్ప మెజార్టీతో గెలిచిన కొన్నిచోట్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఫలితాలని తారుమారు చేశారని ఆరోపించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్‌రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు.