calender_icon.png 24 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సేల్స్‌కు న్యూటైమ్!

24-12-2025 01:27:26 AM

  1. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు  బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి 
  2. మద్యంషాపులు 12 గంటల వరకు ఓపెన్ 
  3. అబ్కారీశాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడి 
  4. ఎన్‌డీపీఎల్, ఎన్‌డీపీఎస్‌లపై ..
  5.   27 నుంచి 29 వరకు దాడులు
  6.   30,31 తేదీల్లోనూ ప్రత్యేక తనిఖీలు
  7. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీ 

హైదరాబాద్, డిసెంబర్  23 (విజయక్రాంతి) : నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు టైమ్‌వేళలను పెంచినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ కమిషనర్ సి.హరికిరణ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి, టూరిజం ప్రాంతాల్లో  అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం తాగడానికి  అనుమతి ఇచ్చారు. ఏ 4 షాపులు (మద్యం షాపులకు) అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చునని కమిషనర్ హరికి రణ్ పేర్కొన్నారు.

అయితే నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా ఎక్సుజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు ఎన్‌డీపీఎల్, ఎన్‌డీపీఎస్‌లపై ప్రేత్యక దాడు లు నిర్వహిస్తారని ఎక్సుజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తెలంగాణ ఎక్సుజ్ శాఖ సిబ్బందితో  పాటు ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు దాడులు నిర్వహి స్తాయన్నారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధుల్లో నాన్ డ్యూటీ పెయిడ్  లిక్కర్, గంజాయి, డ్రగ్స్‌పై దాడు లు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

వరంగల్, నాగర్‌కర్నూర్ జిల్లాలో ఐడీ లిక్కర్ (నాటుసారా లిక్కర్) దాడులు నిర్విహిస్తారని డైరెక్టర్ షానవాజ్ ఖాసీ చెప్పారు. డిసెంబర్ 30,31 తేదీల్లో ప్రత్యేక ఈవెంట్‌లు, వాహన తనిఖీలు,  రూట్ వాచ్  చేపట్టి నాన్ డ్యూటీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి  చర్య లు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఉన్న 20 చెక్‌పోస్టుల్లోనూ, రైళ్లు, వాహనాల్లోనూ అక్రమంగా తరలించే మద్యాన్ని అరికట్టడానికి చర్యలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు.