24-12-2025 02:26:36 AM
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదా న్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మంగళ వారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనం గా జరిగాయి. క్యాంపస్‌లోని ‘విజ్ఞాన్ కళాతోరణం’ వేదికగా జరిగిన వేడుకల్లో విద్యార్థు లు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్ కెరల్స్ (పాటలు), నాటికలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శాంతా క్లాజ్ వేషధారణలో వచ్చిన విద్యార్థి సందడి చేస్తూ అందరికీ మిఠాయిలు పంచడం ప్రత్యే క ఆకర్షణగా నిలిచింది.
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు, అడ్వుజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ‘కల్చరల్ డే’ వైభవంగా నిర్వహించారు. సీఎస్‌సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వ హించిన ఈ వేడుకలు విద్యార్థులు తమలోని సృజనాత్మకతను, కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఒక చక్కని వేదికగా నిలిచాయి.