calender_icon.png 24 December, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత బస్సు మహిళలు అడిగారా?

24-12-2025 01:50:55 AM

కష్ట పడే వారికి చేయూత నివ్వాలి

  1. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు 
  2. ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యమే ఇవ్వాలి 
  3. నేను పదవి విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే 
  4. నాయకులకు తప్పుడు భాష మాట్లాడటం అలవాటైంది 
  5. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

హైదరాబాద్ , డిసెంబర్ 23 సిటీబ్యూ రో (విజయ క్రాంతి ) : మహిళలకు రెండు తెలుగు రాష్ట్రాలు అందిస్తున్న ఉచిత బ స్సు పథకాలపై మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఉచితాలు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ‘ఫ్రీ బస్సులు ఇవ్వమని ప్రజలు అడిగారా? ఉచితాల పేరుతో వారిని సోమరులుగా మార్చుతున్నారు. వాటిని ఆపేసి నిజంగా కష్టపడే వారికి అవకాశా లు, సహాయం అందించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ప్రధా ని అటల్ బిహారి వాజ్‌పేయి నాయకత్వాన్ని కొనియాడిన వెంకయ్య నాయుడు, ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలనే ప్రథ మ స్థానంలో పెట్టేవారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు, సేవాభా వం ముఖ్యమని, యువత ఈ అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత కా లంలో రాజకీయ నాయకులు తక్షణ లాభా ల కోసం ఉచిత పథకాలను ఆశ్రయిస్తున్నారని, దీని వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని అన్నారు. విద్య, వైద్యం రంగాల్లో పెట్టుబడులు పెడితే దేశ భవిష్యత్ బలపడుతుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. పేద ప్రజలకు విద్యా, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని వెంకయ్య నాయుడు చెప్పారు.

మిగతావి ఏవీ కూడా ఉచితంగా ఇవ్వకూడదన్నారు. ఉచిత పథకాలు ఏమాత్రం మంచివి కాదని తెలిపారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని సూచించారు. రాజకీయ నాయకు లకు తప్పుడు భాష మాట్లాడటం అలవాటైపోయిందన్నారు. తాను పదవి విరమణ మాత్రమే చేశానని, పెదవి విరమణ చేయలేదన్నారు. 

వాజ్‌పేయి జీవితం ఆదర్శనీయం

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జీవితం ఆదర్శనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. ఆయన శతజయంతి కార్యక్రమంలో రాం చందర్‌రావు పాల్గొని మాట్లాడారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు, నాయకులు శాసనసభలలో వాదనలు, విభేదాలు జరిపే అవకాశం ఉంటుందని అయినప్పటికీ, సభ వెలుపల వ్యక్తిగత శత్రుత్వాలను పక్కన పెట్టి ముందుకు సాగడం అత్యంత అవసరమన్నారు. ప్రతీది ఉచితం అనేది ఎంతో ప్రమాదకరమని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని,  రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులు వస్తున్నాయి. కొందరు పెన్షనర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మరికొందరు రోడ్లపైకి వచ్చి భిక్ష అడిగే స్థితి ఏర్పడుతోంది. ఇది చాలా బాధాకరమన్నారు.  అందుకే ప్రభుత్వాలు ఆదాయం - ఖర్చు మధ్య సమతుల్యత పాటించాలని సూచించారు.   ఈ సమతుల్యతను సాధించిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మాత్రమేనని, అందుకే వాజ్ పేయి జయంతిని ‘గుడ్ గవర్నెన్స్ డే’గా దేశం మొత్తం జరుపుకుంటోందన్నారు.

రాజకీయాల్లో భాషా ప్రయోగం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నాయకులు విధానపరమైన విమర్శలు, సైద్ధాంతిక చర్చలు మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలు వలను గౌరవించడం తప్పనిసరి అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలాంటి కొత్త పరంపరను కొనసాగించాలని వ్యక్తిగత దాడుల ద్వారా రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,  రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్,  ఎమ్మెల్సీలు అంజిరెడ్డి , మల్క కొమురయ్య , ఢిల్లీ ప్రతినిధి నూనె బాలరాజు తదితర నాయకులు హాజరయ్యారు.