calender_icon.png 1 November, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

01-11-2025 12:00:00 AM

టేకులపల్లి, అక్టోబర్ 31, (విజయక్రాంతి):టేకులపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ 106 సంవత్సరాల ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ జెండాను సిపిఐ జిల్లా నాయకులు గుగులోత్ రామ్ చందర్ ఎగరవేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చందర్ మా ట్లాడుతూ.. 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన సంఘం ఏఐటియుసి ఆనాడు వేట్టి చాకిరికి దోపిడీకి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం ఆనాడు ఐక్యంగా బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీగా లాజపతిరాయ్, ఎంఎన్ జోషి నాయకత్వంలో మొదటి మహాసభ జరిగిందన్నారు.

ఆనాటినుండి నేటి వరకు ఏఐటీ యూసీ నాయకత్వంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించుకొని కార్మికులకు పని గంటలు, వేతన ఒప్పందం, రక్షణ, ఇన్సూరెన్స్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ప్రమాద భీమా పథకం, పెన్షన్ స్కీం ఇలా అనేక కార్మిక చట్టాలను సాధించుకున్న చరిత్ర ఏఐటియుసిదని అన్నారు. సుదీర్ఘ పోరాటాలు చరిత్రలు కలిగిన ఏఐటీయూసీలో ఉండడం గర్వ కారణం అన్నారు.

ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు చట్టాలను చేయాలని చూస్తుందని దీనిని కార్మికులు ఐక్యంగా వ్యతిరేకించాలని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా 2025 డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో జోగా నాగేంద్రబాబు, తేజావత్ మధు, ఈసం నరేష్, జాటోత్ భోజ్య, గుగులోత్ సోనీ, చింత దేవమ్మ, అరుణ భారతి, మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.