calender_icon.png 2 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ బోర్డును సందర్శించిన నేపాల్, భూటాన్ అధికారులు

01-11-2025 12:00:00 AM

అందిస్తున్న సేవలపై ఆరా

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): తెలంగాణ ఇంట ర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని నేపాల్, భూటాన్ దేశాల విద్యాబోర్డుల అధికారులు శుక్రవారం సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి, దాని పనితీరును తెలుసుకున్నారు. ఈ కేంద్రం ద్వారా రాష్ర్టవ్యాప్తం గా ఉన్న అన్ని జూనియర్ కళాశాలలను సీసీటీవీ నెట్‌వర్క్‌తో అనుసంధానం, విద్యార్థుల హాజరును, హ్యూమన్ రిసో ర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఉద్యోగుల సేవలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వారికి ఇంటర్ బోర్డు అధికారులు వివరించారు.