31-10-2025 11:57:42 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా శుక్రవారం దుబ్బగూడ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడకం మూలంగా కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం మరియు కొనిపించడం నేరమని తెలిపారు.