calender_icon.png 1 November, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

01-11-2025 12:27:19 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్

కొండాపూర్, అక్టోబర్ 31 : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో కొండాపూర్ మండలంలోని తెర్పొ ల్ గ్రామంలో నష్టపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంథా తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షలు ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయని అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలలో పంటలు నష్టపోయారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వరి కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రైవేటు రైస్ మిల్లర్స్ తక్కువ రేటు చెల్లిస్తూ రైతులు మోసం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను పంపి పరిశీలన చేసి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె. రాజయ్య, రైతు సంగం జిల్లా ఉపాధ్యక్షులు బి.నరసింహారెడ్డి గ్రామ నాయకులు వెంకటేష్, మధు,రాజు, రైతులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

చేగుంటలో...

చేగుంట ఎస్త్స్ర శ్రీ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సమైక్య దినోత్సవంను పురస్కరించుకుని ఐక్యతకు ప్రతీకగా శుక్రవారం 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయిత ప రంజ్యోతి, పిఏసిఎస్ చైర్మన్ అయిత రఘరాములు, ఏఎస్‌ఐ శ్రీనివాస్, చల్ల లక్ష్మణ్, పెంటా గౌడ్, మనోహరరావు, వారాల నరసింహులు, లైన్స్ క్లబ్ సభ్యులు రామచంద్రం, లింగమూర్తి, సంజీవ్, ప్రశాంత్, సంతోష్, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, సత్తయ్య, రాజు, రమేష్, వెంకటేష్, విట్టల్, మహేష్, బ్రహ్మం, లక్ష్మణ్, సత్యం, విద్యార్థులు, యువత, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. 

మనోహరాబాద్లో..

మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ 2కె రన్‘ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర సుభాష్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు. ఈ 2కె రన్ ఐటీసీ దండుపల్లి నుండి మనోహరాబాద్ వరకు సాగింది. సుమారు 175 మంది యువకులు పాల్గొన్నారు. 

తూప్రాన్లో...

తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సాంఘిక సంఘ సేవకుడు కొలిచెలిమే లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చింతల జయరాములు, చింతల వెంకటేశం, బోసమోయిన వినోద్, ఉడుత ఎల్లం, తదితరులు ఉన్నారు.