09-05-2025 01:12:51 PM
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
అన్ని రంగాల కార్మికులకు పిలుపు
బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): ఈ నెల 20 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకలదాసు(AITUC District General Secretary Mekaladasu) పిలుపునిచ్చారు. శుక్రవారం బెల్లంపల్లిలో సార్వత్రిక పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలనీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు తలపెట్టినట్టు పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని మండిపడ్డారు.
సంపద సృష్టికర్తలలైనా కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసే కార్మిక చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ లుగా చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసీ, కేవలం కార్పొరేటు వ్యాపార వర్గాలకు అనుకూలతకు వంత పాడుతున్నారన్నారు. కార్మిక చట్టసవర్లను వ్యతిరేకిస్తూదేశ వ్యాప్త సమ్మె జరగబోతోందన్నారు .వెంటనే కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, 4 కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశం వెలిగిపోతుందనీ,కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పనిచేస్తున్న అసంఘటితరంగా కార్మిక వర్గానికి పని భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనాలు లేవన్నారు.
స్కీంవర్కర్లను చాలీచాలని వేతనాలతో వాళ్ళ శ్రమ దోచుకుంటున్నారన్నారు. హమాలిరంగంలో పనిచేసే కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందనీతెలిపారు. ఇన్ని సమస్యలున్నా ఈ దేశం వెలిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం సత్యదూరమని విమర్శించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు సహజ సంపదలు కార్పొరేట్ వర్గానికి అందజేయడం కోసం మాత్రమే ఈ కార్మిక చట్ట సవరణలనీ,వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోనీ అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, ఆడెపు రాజమొగిలి, హమాలీ కార్మికులు చంద్రశేఖర్, నరేష్, సతీష్, రమేష్, రవి, శ్రీనివాస్, మొగిలి,సత్తయ్య పాల్గొన్నారు.