calender_icon.png 10 May, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ

09-05-2025 09:32:29 PM

శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం జాకోర ఎత్తి పోతల పథకం(Jakora Lift Irrigation Scheme) కోసం జాకోర గ్రామంలో నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivasa Reddyభూమి పూజ చేశారు. జాకోర ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తొమ్మిది గ్రామాల పరిధిలోని 4,470 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంది. జాకోర ఎత్తి పోతల పథకం కోసం జాకోర గ్రామంలో ఇవాళ నూతన విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసుకున్నామన్నారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పోచారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు  పాల్గొన్నారు.