calender_icon.png 10 May, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో ఉపాధి కల్పించలేని అధికారులు

09-05-2025 09:05:45 PM

కాటారం గ్రామపంచాయతీలో అధికారుల వింత పోకడ

కాటారం,(విజయక్రాంతి): కాటారం గ్రామ పంచాయతీలో ఉపాధి పనులకు బ్రేక్ పడింది. అధికారుల వింత పొకడతో ఉపాధి కూలీలకు గత నాలుగు రోజుల నుండి పని కల్పించడం లేదని బిఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్  ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు పెన్ డౌన్ లో ఉన్నారని చెబుతూ.. ఉపాధి కూలీల ఉపాధికి ఎగనామం పెట్టారని పేర్కొన్నారు. ఉన్నత అధికారులను వివరాలు అడిగితే,  పొంతన లేని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. జూన్ లో వర్షాలు పడితే కూలీలు యధావిధిగా వ్యవసాయ పనులలో నిమగ్నమై వ్యవసాయ పనులకు వెళ్తారని, ఉపాధి హామీ పనులు ఏప్రిల్, మే నెలలో మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. గత సోమవారం నుండి ప్రజలకు కూలి పనులు కల్పించలేకపోయిన మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. కాటారం గ్రామ పంచాయతీలోని కూలీలకు ఉపాధి హామీ పనులు ఎందుకు కల్పించలేక పోయారో జిల్లా కలెక్టర్  విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాటారం గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ కూలీలు అందరికీ వెంటనే పనులు కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బిఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు.