09-05-2025 01:15:51 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని భూగర్భగనిని మందమర్రి జీఎం దేవేందర్(Mandamarri GM Devender) విజిట్ చేశారు. శుక్రవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఉదయం షిఫ్టులో శాంతిఖనికి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, గని పరిస్థితిని కార్మికుల పరి తీరు ను తెలుసుకున్నారు. అనంతరం గనిలోకి దిగారు. భూగర్భలో ఉత్పత్తి ప్రక్రియ పనితీరును పరిశీలించేందుకు ఆయన ఈ విజిట్ చేశారు. ఆయన వెంట ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని రక్షణ అధికారి పి. రాజు, గని సంక్షేమ అధికారి ఇ.రవి కుమార్, ఇతర అధికారులు అండర్గ్రౌండ్ విసిటింగ్ లో ఉన్నారు.