calender_icon.png 4 July, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి సెంటర్ లో అక్షరాభ్యాసం

17-04-2025 01:29:14 PM

మహదేవపూర్, (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల(Mahadevpur Mandal) కేంద్రంలోని నాలుగో అంగన్వాడి కేంద్రంలో  గురువారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పోషణ్ పక్వాడలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం హేమలత మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకోవడంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడి టీచర్లు చెప్పిన విధంగా పోషకాహారం తీసుకొని వారి పిల్లల ఎదుగుదలకు పిల్లలు ఆరోగ్యకరంగా ఉండుటకు దోహదపడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి సెంటర్ల ద్వారా పోషకాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్  సునీత ఆశా వర్కర్ మాధవి పిల్లల తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.