calender_icon.png 8 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు హెచ్‌ఎండీఏ నిధులు మంజూరు

08-11-2025 12:09:26 AM

  1. రూ.2 కోట్లతో సీసీ రోడ్డు, ఫిల్టర్‌బెడ్ అభివృద్ధి  
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబర్ 7(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణం రాజంపేట నుంచి ఈద్గా వరకు సీసీ రోడ్డు నిర్మా ణం, ఫిల్టర్ బెడ్‌లో అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు విడుదలైనట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రా జంపేట క్రాస్ రోడ్ నుంచి ఫిల్టర్ బెడ్ మీదుగా ఈద్గా వరకు సీసీ రోడ్డు మం జూరైందన్నారు.

రాజంపేట ఫిల్టర్ బెడ్ లో కంపౌండ్ వాల్, సీసీ, వాచ్‌మెన్ రూ మ్, లైటింగ్ ఏర్పాటుకు నిధులు మం జూరయ్యాయని తెలిపారు. కాగా ఈ పనులు చేపట్టేందుకు రూ.2 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు విడుదల చేయించడానికి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కృషి చేసినట్లు తెలిపారు. 

అతి త్వరలో పనులు ప్రారంభం 

రాజంపేట క్రాస్ రోడ్ నుంచి ఫిల్టర్ బెడ్ మీదుగా ఈద్గా రోడ్డు పూర్తిగా చెడిపోయిందని, వర్షాలు వస్తే బురద మయంగా మారి నడవటానికి వీలు లేకుండా మారిందని స్థానికులు జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అదేవి ధంగా ఫిల్టర్ బెడ్ లో వాచ్‌మెన్ గది లేదని, సీసీ లేక ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ సిబ్బంది తెలపడంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదనలపై టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల, జగ్గారెడ్డి వినతి మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు రూ.2 కోట్ల నిధులు విడుదల చేశారు.