calender_icon.png 8 November, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

08-11-2025 01:17:28 AM

ఎన్‌సీటీఈ చైర్మన్‌కు ఏబీఆర్‌ఎస్‌ఎం, తపస్ వినతి

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): విద్యాహక్కు చట్టం రాకముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అఖిల్ భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంగ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం), తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నేతలు ఎన్‌సీటీఈను కోరారు. ఈమేరకు ఢిల్లీలో శుక్రవారం ఎన్‌సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా, మెంబర్ సెక్రటరీ అభిలాష్ ఝాలను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ ఈనెల 18న టెట్ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రితో సమావేశం కానున్నామని, సమాలోచనలు చేసి ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలతో చెప్పినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌సీటీఈ అధికారులను కలిసిన వారిలో ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సంఘటనా కార్యదర్శి మహేందర్ కపూర్, జాతీయ ప్రధానకార్యదర్శి గీతాభట్‌తోపాటు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు తదితరులున్నారు.