calender_icon.png 8 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వందేమాతరం 150వ వార్షికోత్సవం

08-11-2025 01:17:02 AM

దేశ్‌ముఖ్‌లోని విజ్ఙాన్స్ వర్సిటీలో వేడుకల నిర్వహణ

భూదాన్ పోచంపల్లి, నవంబర్ 7(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూ దాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ వందేమాతర గేయాలాపన చేశారు.

ఈ సం దర్భంగా యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ కవీంద్రు డు బంకించంద్ర ఛటర్జీ వందేమాతర గేయా న్ని రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో ఈ గేయం నూతన స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలిగించిందన్నారు.సమరయోధులకు మనోబలా న్ని, దేశ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిందని గుర్తుచేశారు.

బంకించంద్ర ఛటర్జీ ప్రశాంత, దృఢచిత్తంలో ఉద్భవించిన ఈ గేయం స్వాతంత్య్ర ఉద్యమ శ్లోకంగా నిలిచి నేటికీ జాతీయ రాగంగా భాసిల్లుతోందని వివరించారు. వందేమాతరం కేవలం ఒక పాట కాదని, భారతీ యాత్మ సమష్టి స్వరమని చెప్పారు.

యువత, విద్యార్థుల్లో జాతీ యతా భావాన్ని, దేశభక్తిని పెంపొందిస్తోందన్నారు. స్వాతం త్య్ర సంగ్రామంలో యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించిన ‘వందేమాతరం’ గేయం స్ఫూర్తిని గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఈ గేయం ప్రాముఖ్యతను, దాని ఘన చరిత్రను నేటి తరం సూచించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.