08-11-2025 01:18:41 AM
ఐఐఎంసీ కళాశాలలో నిర్వహణ
ఖైరతాబాద్, నవంబర్ 7(విజయక్రాంతి) :‘వందేమాతరం గేయం‘ 150 సంవత్సరాల వేడుకలలో భాగంగా ఐఐఎంసీ కళాశాలలో జాతీయ సేవా పథకం యూనిట్ 1, 2 ఆధ్వర్యంలో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ లోని పూర్తి వందేమాతర గేయాన్ని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సీసీ కాడెట్లు మరియు కళాశాల విద్యార్థులచే ఆలపింపచేశారు. తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ కూర రఘువీర్ వందేమాతర గేయం ప్రాముఖ్యతను వివరిస్తూ మొట్ట మొదటిసారిగా ఈ గేయాన్ని జాతీ య కాంగ్రెస్ మహాసభలో రవీంద్రనాథ్ ఠా గూర్ ఆలపించారు.
స్వాతంత్య్రం సిద్దించిన తర్వాత మొట్టమొదటి భారత అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ ఈ గేయాన్ని జా తీయ గేయంగా ప్రకటించారు.అలాగే విద్యార్థులు విద్య నేర్చుకోవడంతో పాటు, ప్రతి ఒ క్కరు దేశసేవలో నిమగ్నం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్‌లు డా.తిరుమలరావు, డా.సంతోషి, ఎన్‌ఎస్‌ఎ స్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎం.సత్యనారాయణ, రామకృష్ణ ఇరుకుల్ల, ఎన్‌సీసీ ఆఫీసర్ వసంత్‌కుమార్, వివిధ విభాగాధి పతులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.