calender_icon.png 6 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ కమిటీకి మహర్దశ

06-08-2025 12:44:25 AM

- ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ. 2.34 కోట్ల నిధులు మంజూరు

- ఎమ్మెల్యే మదన్మోహన్ కృషితోనే  అభివృద్ధి

- ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి

ఎల్లారెడ్డి ఆగస్టు 5 (విజయ క్రాంతి) : ఎన్నో ఏళ్ల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి బాటలు వేసుకుంటుంది. గత పాలకుల పాలనలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజా ప్రభుత్వ పాలనలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి మహర్దశ పట్టింది.

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి, ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక కృషితో, 2.34 కోట్లు నిధులు మంజూరు చేశారని, అన్నారు. మంగళవారం, ఎల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా రెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడి పురాతన భవనంలో, విధులు నిర్వహించిన వ్యవసాయ మార్కెట్, కార్యాలయంకు మంచి రోజులు వచ్చాయని, నియోజకవర్గ రైతులకు శుభవార్త అని ఎమ్మెల్యే మదన్ మోహన్  కృషితో  నిధులు మంజూరయ్యాయి అని, మార్కెట్, కమిటీ చైర్మన్ మా రెడ్డి, రజిత, వెంకటరామిరెడ్డి, హర్షం వ్యక్తం చేశారు.

కొత్త మార్కెట్ కార్యాలయం నిర్మాణం కొరకు 86.80 లక్షలు,10 షాపులు నిర్మాణం కొరకు 83.80 లక్షలు,మార్కెట్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు 18.80 లక్షలు,మరుగుదొడ్లు నిర్మాణం కొరకు 13.00 లక్షలు,100 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వెయింగ్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు 32.50 లక్షలు, నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్మోహన్ బాటలు వేస్తున్నారని అన్నారు, ఎమ్మెల్యే మదన్మోహన్రావు కృషి వల్ల నూతన బస్టాండ్ నిర్మాణం,100 పడకల ఆసుపత్రి, ఎల్లారెడ్డి పెద్ద చెరువు పై వాకింగ్ ట్రాక్, అర్బన్ పార్క్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఏటీసీ సెంటర్ వంటి అభివృద్ధి పనులు  ఎన్నో చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నలగడ్డ రాజు, డైరెక్టర్లు గంగారెడ్డి, శంకరయ్య, వెంకట్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.