06-07-2025 08:13:20 PM
నాగారం: సూర్యాపేట జిల్లా(Suryapet District) ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులుగా ఆలకుంట్ల బాలకృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుఐ ఐఎన్‌టియుసి(INTUC) జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి ఐఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్ లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తంకుమార్ రెడ్డికి మాజీ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామెల్ కి ఉత్తం పద్మావతికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, డిసిసి చెవిటి వెంకన్న యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నని అన్నారు. అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ... అనుబంధ ఉన్నటువంటి యూనియన్ల సంఘటిత అసంఘటిత కార్మికుల న్యాయమైన హక్కుల కొరకు ఐఎన్టీయూసీ ద్వారా పోరాటం చేస్తూ వారి డిమాండ్లను సాధించుకోవడానికి కృషి చేస్తానని అన్నారు.